తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధ్యదైవంగా పూజిస్తున్న బతుకమ్మ పండుగపై ఏఐటీయూసీ నాయకులు విమర్శలు....
యైటింక్లయిన్‌కాలనీ : తెలంగాణ ఆడబిడ్డలు ఆరాధ్యదైవంగా పూజిస్తున్న బతుకమ్మ పండుగపై ఏఐటీయూసీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పర్ర రాజనరేందర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణాకర్, సంపత్‌రెడ్డి, రాఘవరెడ్డి, కొలిపాక మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర పండుగను విమర్శించే వారికి తెలంగాణలో ఉండే అర్హత లేదని తెలిపారు.
సెంటినరీకాలనీలో తమ యూనియన్ ఆఫీస్‌ను కమ్యూనిటీ హాలుగా మార్చి కార్మికుల అవసరాలకు వేలాదిరూపాయల అద్దె వసూలు చేస్తున్న ఏఐటీయూసీ నాయకులకు ఈవిషయం తెలియదా అని ప్రశ్నించారు. అనవరస ఆరోపణలు చేయొద్దని సూచించారు.