నల్గొండ జిల్లా కోదాడ మండలం మొగులాయిపల్లి గ్రామానికి చెందిన జగన్నాథరెడ్డి(7) అనే బాలుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.
నల్గొండ జిల్లా కోదాడ మండలం మొగులాయిపల్లి గ్రామానికి చెందిన జగన్నాథరెడ్డి(7) అనే బాలుడు వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే ఆ బాలుడు మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బావిలో శవమై తేలాడు. ఖమ్మం పట్టణలోని గుర్రాలబండ బావిలో బాలుడు శవమై తేలుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలుడిని జగన్నాథరెడ్డిగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో అదృశ్యమైన బాలుడు ఖమ్మం జిల్లాలో బావిలో శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేసి హతమార్చి బావిలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.