ఎస్సీ వర్గీకరణ కేంద్ర జాబితాలోని అంశం
-
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
కామారెడ్డి రూరల్ :
ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్ర జాబితాకి సంబంధించినదని, దీనిపై చట్టాలు చేసేందుకు పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం కామారెడ్డిలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. హింసాత్మక పద్ధతుల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, మాదిగ ఉప కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలన్నారు. పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు
కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. వచ్చే నెల 13న హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో వర్గీకరణ సమస్యపై నిర్వహించనున్న బహిరంగ స¿¶ ను విజయవంతం చేయాలని కోరారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌కు మల్లన్న సాగర్ మీద ఉన్న ప్రేమ వర్గీకరణపై లేదన్నారు. తెలంగాణ మాదిగ యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా సంపత్‌ను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. లింగం, సాయిలు, గడ్డం నర్సయ్య, లక్ష్మన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.