గొప్ప ఆర్టిస్టుల కలయిక నా కెంతో ఆనందం
∙మంచు మోహన్ బాబు
∙అట్టహాసంగా విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ వేడుకలు
చంద్రగిరి: దేశ, విదేశాల్లోని గొప్ప గొప్ప ఆర్టిస్టులను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్ట ర్ మోహన్‌బాబు అన్నారు. మండలంలోని రంగంపేట సమీపంలోని విద్యానికేతన్ విద్యాసంస్థల్లో గురువారం విష్ణు మంచు ఆర్ట్ ఫౌం డేషన్ మూడో వార్షికోత్సవం జరిగింది. ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విష్ణుమంచు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ఈ ఆర్ట్ ఫౌండేషన్‌ను విష్ణు స్థాపించినప్పుడు తనకు దీని విలువ తెలియలేదన్నారు. అయితే గత మూడేళ్లలో కళాకారులను ప్రోత్సహించి, భావి తరాలవారికి కళలపై మక్కువ పెంచాలని విష్ణు చేసిన ఈ ప్రయత్నం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.
విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విద్యానికేతన్ విద్యాసంస్థల్లో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని గొప్ప ఆర్టిస్టులందరూ ఈ కార్యక్రమానికి వచ్చారన్నారు. ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులందరూ ఏకలవ్యుడితో సమానమని, ఏ చిత్రాన్ని చూసినా మనమూ అం త గొప్పగా పెయింటింగ్ వేయాలని నిరంతరం తపించిపోవాల్సిందేనని చెప్పారు. ఇటువంటి గొ ప్ప కళాకారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. విద్యానికేతన్ ప్రాంగణంలో దాదాపు రూ.16 కోట్లతో లైబ్రరీ, మ్యూ జియం నిర్మించామని చెప్పారు. శ్రీవారిని దర్శిం చుకోవాడానికి తిరుపతికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ ఈ లైబ్రరీని చూడాలన్న లక్ష్యంతో ఏర్పా టు చేశామన్నారు. త్వరలోనే లైబ్రరీని ప్రారంభిస్తామన్నారు. ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్‌ని లైబ్రరీ లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు మన మధ్యలో ఉన్నా, వారిని గుర్తించలేక పోతున్నామని, అటువంటి చిత్రకారుల ను గుర్తించి వాళ్లు వేసిన చిత్రాలను కోట్లాది మంది ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభించామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి పద్మశ్రీ లక్ష్మగౌడ, దేశంలోనే గొప్ప ఆర్టిస్టు అయిన సరోజ్‌పాల్‌తో పాటు ఎంతో మంది గొప్పవారు వచ్చారని తెలిపారు. విద్యానికేతన్ లోని 14 వేల మంది విద్యార్థుల్లో కనీసం రోజుకు 3 వేల మంది విద్యార్థులు లైబ్రరీని సందర్శిస్తారని, అందులో కొంతమంది విద్యార్థులైనా ఈ పెయింటింగ్స్‌ను చూసి, ఉత్తేజితులై, చిత్రలేఖనం నేర్చుకుంటారనే ఉద్దేశంతో లైబ్రరీని మ్యూజియంగా కూడా మార్చామని చెప్పారు. అంతకుముందు దేశ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన సుమారు 100 మంది చిత్రకారులకు మోహన్‌బాబు జ్ఞాపికలను అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మంచు మనోజ్, స్పెషల్ ఆఫీసర్ గోపాల్‌రావు, ఆచార్య భగవానులు, కృష్ణమాచారి, భగవానులు, రవిశేఖర్, తులసీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.