అశాస్త్రీయ విభజనకు కడియందే బాధ్యత
Published Fri, Aug 26 2016 12:17 AM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM
వరంగల్ : జిల్లాల వి¿¶ జనలో ప్రభుత్వం అవలంభిస్తున్న అశాస్త్రీయ పద్ధతికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిదే బాధ్యత అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలనతో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన సరైందే అయినా శాస్త్రీయత లేకపోవడంతో భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లాను ముక్కలు చేసి కేటీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటల రాజేందర్‌లకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే చేతులకు గాజులు వేసుకున్నావా అని కడియంను ప్రశ్నించారు. కేసీఆర్ పాలన ని జాంను మరిపిస్తోందని విమర్శించారు. మహా రాష్ట్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టులపై పోరాడాల్సింది పోయి మహా ఒప్పందం పేరిట రాష్ట్రా న్ని వారికి బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకుంటే అప్పటి ప్రభుత్వాలు 152 మీటర్ల ఎత్తు కోసం పోరాడాయని, వాటిని మార్చి ఇప్పుడు 148 మీటర్లకు అంగీకరించడం ఏం టని ప్రశ్నించారు.
ఆయన బంధువు, గవర్నర్ విద్యాసాగర్ కోసమో, బంధువర్గాల వ్యాపారాల కోసమో మహారాష్ట్ర వద్ద తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడని అన్నా రు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు ఆయోమయంలో పడ్డారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం అన్నారు. ఆయన నిర్ణయాలు ప్రజామోదం అని ప్రకటిం చుకుంటున్నా, వాటిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం గమనించాలని సూచించా రు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, పుల్లూరు అశోక్‌కుమార్, చాడ రఘునాథ్‌రెడ్డి, బాస్కుల ఈశ్వర్, మార్క విజయ్, దొనికెల మల్లయ్య, మార్గం సారంగం, రహీం, హన్మకొండ సాంబయ్య, నక్కా లింగ య్య, శ్రీనివాస్, చారి, రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement