సిద్దేశ్వరం వద్ద తీవ్ర ఉద్రిక్తత | the extreme tension at siddesvaram | Sakshi
Sakshi News home page

సిద్దేశ్వరం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Published Tue, May 31 2016 9:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

the extreme tension at siddesvaram

కర్నూలు జిల్లాలో కృష్ణా నదిపై రైతులు తలపెట్టిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార టీడీపీ మినహా మిగతా రాజకీయపార్టీలు, రైతులు మంగళవారం సిద్దేశ్వరం వద్ద అలుగుకు భూమిపూజ తలపెట్టగా ఆత్మకూరు, కొత్తపల్లి, సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాల్లో పోలీసులు 144వ సెక్షన్ విధించింది.

 

అలుగు సాధన సమితి పేరిట ఒక్కటైన వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలను,ై రెతులను అరెస్టు చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేత భరత్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయటంతోపాటు శ్రీశైలం నియోజకవర్గ నేత బుడ్డా శేషారెడ్డిని ఆయన స్వగ్రామం వెల్పునూరులో గృహ నిర్బంధంలో ఉంచారు. అంతేకాకుండా నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారి అరెస్టులకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ దమనకాండపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement