నాగిరెడ్డిపేట మండలంలో 144 సెక్షన్ అమలు చేశారు. నాగిరెడ్డిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే కామారెడ్డి జిల్లాలో కలపుతూ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలపాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ‘ప్రజాఐక్య వేదిక’ పేరిట జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. సోమవారం కూడా నిరసనలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మండలకేంద్రంలో 144 సెక్షన్ అమలుపరిచారు.
నాగిరెడ్డిపేటలో 144 సెక్షన్ అమలు
Published Mon, Oct 3 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
Advertisement
Advertisement