యుద్ధ విమానాల్లో మహిళలను పైలట్లుగా నియమిస్తున్న తరుణంలో ఆర్టీసీలో మహిళలను డ్రైవర్లుగా నియమించకపోవడం విచారకరమని
నేషనల్ మజ్దూర్ యూనియన్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: యుద్ధ విమానాల్లో మహిళలను పైలట్లుగా నియమిస్తున్న తరుణంలో ఆర్టీసీలో మహిళలను డ్రైవర్లుగా నియమించకపోవడం విచారకరమని టీఎస్ ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అభిప్రాయపడింది. 33 శాతం మహిళా డ్రైవర్ల పోస్టులు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఎన్‌ఎంయూ నాయకులు ఎం.నాగేశ్వర్‌రావు, లక్ష్మణ్, మౌలానా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ పోస్టుల్లో మహిళలకు 33 శాతం కోటా భర్తీ చేయాలని కోరారు.