మళ్లీ అదే తప్పిదం
మారని ఎస్వీయూ పరీక్షల విభాగం తీరు
బీకాం మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం కూర్పులో నిర్లక్ష్యం
ఒకటే నమూనా... రెండు ప్రశ్నలు!
అయోమయంలో విద్యార్థులు
పుత్తూరు: ఎస్వీయూ డిగ్రీ పరీక్షల నిర్వహణను ఆషామాషీగా తీసుకున్నట్లుంది. సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులు గందరగోళానికి గురవుతూనే ఉన్నారు. మొదట సిలబస్‌కు విరుద్ధంగా ఇంగ్లిష్ ప్రశ్నపత్రంతో మొదలైన తప్పుల పరంపర మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకూ పాకింది. గత సంవత్సరం పుస్తకం నుంచి ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు గగ్గోలుపెట్టారు. నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్వీయూ మాట నిలబెట్టుకోలేకపోరుుంది. శుక్రవారం జరిగిన బీకాం (జనరల్) మొదటి సెమిష్టర్ ఫైనాన్షియల్ ఎకౌంటెన్సీ పరీక్షకు రూపొందించిన ప్రశ్నపత్రం విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టింది. ఒకే నమూనాతో సెక్షన్, సంఖ్య మారి రెండు ప్రశ్నలు రావడం, ఒకే నమూనాతో మూడు మార్కుల ప్రశ్న, 12 మార్కుల ప్రశ్న రావడం, 2వ సెమిస్టర్ సిలబస్‌కు సంబంధించి 3 మార్కుల ప్రశ్న రావడంతో విద్యార్థులు బిక్కమొహం వేశారు.
విద్యార్థులు తెలిపిన మేరకు ప్రశ్నపత్రం వివరాలు..
►{rరుుల్ బ్యాలెన్‌స సంబంధించి 2వ యూనిట్‌లో 4వ ప్రశ్న - రమేష్ యొక్క అంకణాను తయారుచేయండి (12 మార్కులు) ఇదే నమూనాతో 3వ యూనిట్‌లో 6వ ప్రశ్న - క్రింది వివరాల ఆధారంగా అంకణాను తయారు చేయండి(12 మార్కులు) ఇచ్చారు.
►{తికాలం క్యాష్ బుక్‌కు సంబంధించి 1వ యూనిట్‌లో 3వ ప్రశ్న - క్రింది వివరాల ఆధారంగా 3 వరుసల నగదు చిట్టాను తయారు చేయండి (12 మార్కులు).. ఇదే నమూనాతో 2వ యూనిట్‌లో 5వ ప్రశ్న (12 మార్కులు) వచ్చింది.
►అడ్జెస్ట్‌మెంట్ ఎంట్రీస్‌కు సంబంధించి 5వ యూనిట్‌లో 10వ ప్రశ్న (3 మార్కులు) ఇదే నమూనాతో 12 మార్కుల ప్రశ్న కూడా వచ్చిందని విద్యార్థులు వివరించారు.
►రెండో సెమిస్టర్ సిలబస్‌కు సంబంధించిన కన్‌సైన్‌మెంట్ అనగానేమి? (3 మార్కులు) ప్రశ్న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ఎలా కూర్పు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రశ్నపత్రం సులభంగానే ఉన్నా ప్రశ్నల సరళి ఒకే నమూనాతో రావడంవల్ల యూనిట్ టెస్టులు రాస్తున్న భావన కలుగుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. డిగ్రీ స్థారుు ప్రశ్నపత్రం రూపకల్పనలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని ఎస్వీయూ అధికారులు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో అభాసుపాలు కాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.