జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్‌ఐటీ) ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Sun, Sep 4 2016 11:51 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
కాజీపేట : జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్‌ఐటీ) ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కాజీపేట ఎస్సై భీమేష్ కథనం ప్రకారం.. బాపూజీనగర్‌కు చెందిన కలమల కేశవ్(25) మరో మిత్రుడితో కలిసి పోచమ్మమైదాన్‌లోని ఓ మిత్రుడి జన్మదిన వేడుకలకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఎన్‌ఐటీ ఎదుట వాహనం ఆదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
దీంతో వాహనం నడుపుతున్న కేశవ్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాలపాలైన దయాకర్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, మృతుడు కేశవ్ కుటుంబ సభ్యులను ఆదివారం రాత్రి డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పరామర్శించారు. ఆయన వెంట కార్పొరేటర్ తోట్లరాజు, సయ్యద్‌రజాలీ, సందెల విజయ్ ఉన్నారు.
Advertisement
Advertisement