మార్కెట్‌లో పెసర్ల బస్తా చోరీ
మార్కెట్‌లో పెసర్ల బస్తా చోరీ
Published Thu, Oct 6 2016 12:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
‘కేసముద్రం : రైతు కళ్లుగప్పి ఓ కంపెనీకి చెందిన కూలీలు పెసర్ల బస్తాను మాయం చేసిన సంఘటన మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం జరిగింది. ఈ ఘట నకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. రైతుల కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెంది రైతు తుప్పతూరి జనార్ద న్ మార్కెట్‌కు 3 క్వింటాళ్ల పెసర్లను అమ్మేం దుకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి చెందిన వ్యాపారి క్వింటాకు రూ.4771లకు ఆ పెసర్లను కొనుగో లు చేశాడు. ఆ కంపెనీకి చెందిన కూలీలు కొనుగోళ్లు జరిపిన ఆ పెసర్లను బస్తాల్లోకి ఎత్తడం ప్రారంభించా రు. ఈ క్రమంలో 30 కేజీల బస్తాను వారు మాయం చేశారు. వారు అడుగుల పేరిట తీసుకున్న పెసర్లలో 30 కేజీల పెసర్లను కలుపుకున్నారు. గమనించిన రైతు ఇదేమిటని వారిని వారిస్తుండగా, అక్కడే ఉన్న రైతులంతా బాధిత రైతుకు తోడయ్యారు. ఇంతలో దొంగతనానికి పాల్పడిన వారి లో కొందరు కూలీలు పరారు కాగా, వారిలో ఓకూలీని పట్టుకుని చితకబాదారు.
అతడు కూడా రైతుల నుంచి తప్పించుకుని మార్కెట్ కార్యాలయంలోకి పరుగులు తీసి, ఆఫీస్ గదిలోకి దూరి దాచుకున్నాడు. ఇంతలో పెద్ద ఎత్తున రైతులు మా ర్కెట్ కార్యాలయంలోకి దూసుకొచ్చారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని, తాము కష్టపడి పండించిన పంటను కూలీలు ఎలా దొంగిలిస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో విషయం తెలుసుకున్న ఎస్సై ఫణిదర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఉన్న వ్యక్తి బయటికి వస్తే రైతులు కొడతారనే ఉద్దేశంతో పోలీసులు రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు మార్కెట్ గేటు ఎదుట ఆందోళన చేస్తుండగా, అక్కడికి వచ్చిన మరి కొంత మంది పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా రైతులపై లాఠీచార్జీ జరిపారు. దీంతో రైతులు పరుగులు తీశారు. వారిలో కొందరు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దొంగతనం చేసిన వారిని శిక్షించాల్సింది పోయి, పంట పండించి మార్కెట్‌లో అమ్ముదామని వస్తే తమపై లాఠీచార్జీ చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దొంగతనానికి పాల్పడిన కంపెనీకి చెందిన కూలీల లైసెన్ సలను రద్దు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. అనంతరం వాగ్వాదానికి దిగుతున్న రైతులను పోలీసులు వీడియో తీస్తుండిపోయారు. చివరకు రైతులను చెదరగొట్టిన పోలీసులు గదిలో దాచుకున్ని కూలీని పోలీసులు తీసుకెళ్లి జీపు ఎక్కించి ఠాణాకు తరలించారు. అనంతరం రైతులు శాంతించి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement