కరీంనగర్ జిల్లాలోని కాటారం పోలీస్‌స్టేషన్ నుంచి మంగళవారం రాత్రి ఓ దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
కాటారం: కరీంనగర్ జిల్లాలోని కాటారం పోలీస్‌స్టేషన్ నుంచి మంగళవారం రాత్రి ఓ దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. మహదేవ్‌పూర్ మండలానికి చెందిన రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు.. ఓ చోరీ కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో స్టేషన్లో పోలీసులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఇదే అదునుగా భావించిన రాజేష్ పారిపోయాడు. పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.