మెదక్ : మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోనాల పండగ సందర్భంగా సదరు ఇళ్లలోని వారు హైదరాబాద్ వెళ్లారని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. దీంతో చోరీలపై వారికి పోలీసులు సమాచారం అందించారు. అయితే చోరీలో ఎంత మొత్తంలో నగదు చోరీ అయిందనే విషయం మాత్రం తెలియరాలేదు.