వృద్ధదంపతులపై దాడి.. బంగారం చోరీ | Thieves Hulchul in Nalgonda District | Sakshi
Sakshi News home page

వృద్ధదంపతులపై దాడి.. బంగారం చోరీ

Published Tue, Jul 19 2016 7:38 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves Hulchul in Nalgonda District

నల్గొండ : నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులు లోడి సోమయ్య, రాములమ్మపై దాడి చేసి... బంగారు గొలుసు తెంచుకెళ్లారు. దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా... దొంగలు ఇంట్లో ప్రవేశించి.. రాములమ్మ మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాగాడు. దీంతో వారు మెల్కొని ప్రతిఘటించారు. వారిపై కత్తితో దాడి చేసిన దొంగలు గొలుసు తీసుకుని అక్కడి నుంచి పరారైయ్యారు.

ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి...వారిని ఎల్బీ నగరులోని కామినేని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దంపతులను చోరీపై పలు ప్రశ్నలు అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement