శ్రీకాకుళం: కొత్త నిబంధనలు, విధి విధానాలతో కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాస్త కొత్తగా ఉండే పరిస్థితి ఉంది. డీఎస్సీ 2014 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 13 నుంచి పాఠశాలలో పాఠాలు చెప్పనున్నారు. కొన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు, మరికొన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు మారడం వల్ల పాత ఉపాధ్యాయులు కూడా బోధనకు కొత్తగా ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి డ్రెస్ కోడ్ పేరిట కొత్త నిబంధనను విధించింది. ఉపాధ్యాయులు టీషర్ట్‌లు, జీన్ ప్యాంట్లు, ఎక్కువ జేబులు ఉన్న ప్యాంట్లు ధరించకూడదు. మహిళలు కూడా సంప్రదాయబద్ధంగా వస్త్రాలను ధరించాలి. పాఠశాలలకు ప్రార్థనా సమయానికి ఖచ్చితంగా ఉపాధ్యాయులు హాజరవ్వాలి. ప్రధానోపాధ్యాయులు రోజూ ఒక తరగతి చొప్పున వారంలో ఏడు తరగతులను ఖచ్చితంగా బోధించాలి. ఉపాధ్యాయులకు ఇటువంటి నిబంధన ఉంటే విద్యార్థులు కూడా కొన్ని కొత్త విధానాలను ఆచరించాల్సి ఉంటుంది. ప్రతిరోజు గంటపాటు వ్యాయామం గాని, యోగా కాని బోధించాలి. ఇందుకోసం పీఈటీలు, పీడీలకు యోగాపై ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు.
నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
Published Mon, Jun 13 2016 1:08 PM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement