బస్సులో నుంచి ఎగిరి పడి..
బస్సులో నుంచి ఎగిరి పడి..
Published Sun, Oct 9 2016 9:35 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
రోడ్డుపై పడి మహిళ మృతి
లారీ ఢీకొట్టడంతో ప్రమాదం
రొంపిచర్ల: లారీని ఢీకొన్న బస్సుకు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు అద్దంలోంచి ఎగిరి రోడ్డుపై పడి ఓ మహిళ మృతి చెందింది. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామం వద్ద అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు..ప్రకాశంజిల్లా కందుకూరు మండలం కొవ్వూరుకు చెందిన చిమ్మిరి యానాదమ్మ (46) హైదరాబాదు వెళ్ళే నిమిత్తం కందుకూరులో ప్రై వేటు ట్రావెల్ బస్సు ఎక్కి ముందుభాగంలో కూర్చుంది. విప్పర్ల సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలబడి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు డ్రై వర్ బ్రేక్ వేయడంతో నిద్రలో ఉన్న యానాదమ్మ ఎగిరి అద్దంలో నుంచి రోడ్డుపై పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యానదమ్మ రెండో కొడుకు హైదరాబాద్‌లో తాపీ పనిచేస్తున్నాడు. కోడలు అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు ఆమె హైదరాబాదు బయలుదేరింది. ప్రమాదానికి కారకుడైన బస్సుడ్రై వర్ పరారీలో ఉన్నాడు. యానదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియావైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement