నేడు అట్లా సదస్సు
ఆదోని: తుంగభద్ర దిగువ కాలువ నీటి వాటా సాధనకు చేపట్టాల్సి కార్యాచరణపై అసోసియేషన్ ఆఫ్ తుంగభద్ర ఎల్లెల్సీ ఆయకట్టుదార్స్ (అట్లా) ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయరణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం భీమాస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, మిగులు పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపక పోవడం విచారకరమని అన్నారు. పోరాటేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సదస్సు ఏర్పాటు చేశామని, మేధావులు, ఆయకట్టు బాధితులు, ప్రజలు హాజరై సూచనలు, సలహాలు ఇస్తే ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.