కట్టంగూర్
నల్లగొండలో డెంగీ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం కట్టంగూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విషజ్వరాల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నామమాత్రపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. డెంగీ బారిన పడి పదుల సంఖ్యలో చనిపోయినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవటం శోషనీయమన్నారు. డెంగీ బారిన పడిన రోగులు ప్రవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇదే అదునుగా ప్రవేట్ ఆస్పత్రి యాజమాన్యం దోపిడీకి అంతులేకుండా పోయిందన్నారు. ఒక్కొక్క రోగి నుంచి రూ. రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షలు అందజేయాలని కోరారు. సమావేశంలో ఆపార్టీ జిల్లా కమిటి సభ్యుడు మామిడి సర్వయ్య, మండల కార్యదర్శి నంధ్యాల వెంకట్‌రెడ్డి, పెంజర్ల సైదులు, కట్ట బక్కయ్య ఉన్నారు.
డెంగీ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
Published Thu, Sep 8 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
Advertisement