ఆదిలాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ తన అభీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్ను పెళ్లి చేసుకోబోతోంది. శుక్రవారం సాయంత్రం వీరిద్దరి వివాహం జరగనుంది. మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి ఈ విషయంపై చర్చించారు. శ్రీకాంత్తో పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. అయితే శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడానికే ఆమె మొగ్గుచూపింది. ఆఖరుకు మధుప్రియ తల్లిదండ్రులు తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
కాగజ్‌నగర్కు చెందిన మంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ.. శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20కి వీరిద్దరికీ పెళ్లి చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఉదయం జరగలేదు. ఇరు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. చివరకు మధుప్రియ ఇష్టప్రకారం ఈ రోజు సాయంత్రం ఆమె పెళ్లి జరగనుంది.
సాయంత్రం మధుప్రియ పెళ్లి
Published Fri, Oct 30 2015 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM
Advertisement
Advertisement