పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి
Published Sun, Sep 25 2016 11:32 PM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
ఖానాపురం : పాకాల సరస్సుకు దేశంలోనే రెండో స్థానం లభించగా అలాం టి సరస్సు వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకపోవడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాల వద్ద ఆదివారం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి నర్సింహరాములతో కలసి కట్టమైసమ్మ, మత్తడి వద్ద పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పర్యాటక రంగంపై తెలం గాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి రూ.80 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ చేస్తుందో అర్థంకావడం లేదన్నారు. సరస్సు వద్ద తూముల ద్వారా ఒక పంటకు సరిపడే నీరు వృథాగా పో తుందన్నారు. వర్షాలు పడి పుష్కలం గా నీరు దొరుకుతున్న పాకాలలో నీటి వృథాను అరికట్టకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి పాకాల రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోడి అశోక్‌యాదవ్, కొమ్మాలు, శ్రీనివాస్, రమేష్, రంజిత్, శ్రీకాంత్, మురళి, టాకరాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement