- ఎమ్మెల్యే రాజేశ్వరి
అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం శూన్యం
Published Fri, Nov 11 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
రంపచోడవరం :
గిరిజన యువతకు అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం లేదని వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక బీఎస్‌ఆర్ వికాస, నన్నయ వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన యువతకు కోట్లాది రూపాయాలు ఖర్చు తో శిక్షణ ఇస్తున్నా వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిం చడం లేదని ఆరోపించారు. విజయనగరంలో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు శిక్షణకు వెళ్లిన వారికి వసతి సదుపాయం కల్పించలేదన్నారు. నిరుద్యోగులు డబ్బులు ఖర్చు చేసుకుని ఎక్కడ ఉంటారని ఆరోపించా రు. ఐటీడీఏ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు లెక్కలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా శిక్షణ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్ మాట్లాడుతూ 2013 సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని కూడా శిక్షణకు అనుమతించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బి సువర్ణకుమార్,ఎంపీటీసీ కారుకోడి పూజా, వికాస టీపీఓ సాగర్, బీఎస్‌ఆర్ ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ వికాస ప్రాజెక్టు అధికారి జి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement