mla rajeswari
-
రాజేశ్వరిపై అనర్హత వేటేయండి
సాక్షి, అమరావతి: తమ పార్టీ తరఫున రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వంతల రాజేశ్వరిపై అనర్హత వేటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరింది. ఈ మేరకు బుధవారం వెలగపూడి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కోడెలను వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కలసి ఫిర్యాదు చేశారు. వంతల రాజేశ్వరితోపాటు గతంలో టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపైనా చర్య తీసుకోవాలని వారు స్పీకర్ను కోరారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శిని కలసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే ఉన్నట్టుగా గెజిట్లో చూపించారని, దానిపై సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరగా ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. తాను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. -
నిర్వాసితులందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతాం
పోలవరం నిర్వాసితుల సమస్యలపై పీవోతో చర్చించిన ఎమ్మెల్యే గ్రామాన్ని ఖాళీ చేసే నాటికే కటాఫ్ తేదీగా నిర్ణయించాలి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగే వరకూ పోరాడతామని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సోమవారం రాత్రి ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్తో చర్చించారు. అర్హులైన వారికి రీహేబిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) అమలు చేయాలని కోరారు. దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పొందేందుకు అర్హత ఉన్న వంద మంది పేర్లు ప్యాకేజీ జాబితాలో లేవని నిర్వాసితులు ఎమ్మెల్యే, పీవో ఎదుట చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురైయ్యే గ్రామాల్లో గ్రామాన్ని ఖాళీ చేసే తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అప్పటికి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటరు గుర్తింపు కార్డులు లేని పరిస్ధితి ఉందని వారిని అనర్హులుగా ప్రకటించారని పీవో ఎదుట నిర్వాసితులు వాపోయారు. వారి స్టడీ సర్టిఫికెట్స్ ఆధారంగా వయస్సు నిర్ధారించి ప్యాకేజీ అమలు చేయాలని నిర్వాసితులు కోరారు. ఆరు నెలలుగా రాని ఉపా«ధి వేతనాలు: గోదావరి వెంబడి నివసించే గిరిజనులు కష్టాలు అధికారులు పట్టించుకోవడం లేదని కొండమొదలు నివాసి మంగారావు అన్నారు. ఆరు నెలలుగా ఉపాధి హామీ వేతనలు చెల్లించలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.దీనిపై ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ నిర్వాసితులు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఐటీడీఏ పీవోతో సమావేశమైన నిర్వాసితులు సమస్యలు చర్చించనున్నట్లు తెలిపారు. మడిపల్లి, మంటూరు, నేలకోటలో అర్హులైన వారికి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. నిర్వాసితుల సమస్యలపై పీవో సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాజేశ్వరి తెలిపారు. -
‘పోలవరం’ వైఎస్ పుణ్యమే
తమ ఘనతగా ‘బాబు’ సర్కారు ప్రచారం l ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నెల్లిపాక : పోలవరం ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. బుధవారం రాత్రి ఆమె ఎటపాకలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పేరుతో వేలాది కోట్ల నిధులు కాజేస్తూ ప్రాజెక్టు తమ కృషే అని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. నిర్వాసితులను నిలువునా మోసం చేసేందుకు పూనుకుందన్నారు. సీఎం కాంట్రాక్టర్లపై చూపుతున్న శ్రద్ధ ముంపు మండలాలపై చూపటం లేదని ఆరోపించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షనేత పోరాడుతుంటే పోలవరాన్ని అడ్డుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా, ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు అబద్ధాలు చెపుతూ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విలీన మండలాల ప్రజలకు అబద్ధాలు చెపుతున్న టీడీపీ నాయకులు ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో వివరించాలన్నారు. గత మూడు జన్మభూముల్లో వచ్చిన దరఖాస్తులకు నేటికీ పరిష్కారం చూపకుండా ప్రజలను మోసం చేసి ఇప్పడు జన్మభూమి అంటూ గొప్పలు చెపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తున్న టీడీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఎండీ మూసా, రాయిని రమేష్, చండ్ర కృష్ణార్జునరావు, కడియం రామాచారి, రామలింగారెడ్డి, సర్పంచ్ గుండి లక్ష్మి తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం శూన్యం
ఎమ్మెల్యే రాజేశ్వరి రంపచోడవరం : గిరిజన యువతకు అరకొర శిక్షణ ద్వారా ప్రయోజనం లేదని వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక బీఎస్ఆర్ వికాస, నన్నయ వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన యువతకు కోట్లాది రూపాయాలు ఖర్చు తో శిక్షణ ఇస్తున్నా వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిం చడం లేదని ఆరోపించారు. విజయనగరంలో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు శిక్షణకు వెళ్లిన వారికి వసతి సదుపాయం కల్పించలేదన్నారు. నిరుద్యోగులు డబ్బులు ఖర్చు చేసుకుని ఎక్కడ ఉంటారని ఆరోపించా రు. ఐటీడీఏ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు లెక్కలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా శిక్షణ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్ మాట్లాడుతూ 2013 సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని కూడా శిక్షణకు అనుమతించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బి సువర్ణకుమార్,ఎంపీటీసీ కారుకోడి పూజా, వికాస టీపీఓ సాగర్, బీఎస్ఆర్ ప్రిన్సిపాల్ జె.ప్రసాద్ వికాస ప్రాజెక్టు అధికారి జి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
''వైస్సాఆర్ సీపీలోనే గిరిజనులకు పెద్దపీట''