కాళన్నకు నివాళి | tribute to kaloji narayana rao | Sakshi
Sakshi News home page

కాళన్నకు నివాళి

Published Fri, Sep 9 2016 11:41 PM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

కాళన్నకు నివాళి - Sakshi

కాళన్నకు నివాళి

హన్మకొండ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో ఇదేరోజు సాహితీవేత్తలు తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి కలెక్టర్‌ వాకాటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, మేయర్‌ నన్నపునేని నరేందర్, వరంగల్‌ మహానగర పాలక సంస్థ కమిషనర్‌ సర్ఫరాజు ఆహ్మద్, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పటేల్, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గొట్ట సుధీర్‌బాబు, రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిశోర్‌ఝా, సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్‌ డీ.ఎస్‌.జగన్, వరంగల్‌ ఆర్డీఓ వెంకటమాధరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
ఇంకా టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్‌మోహన్‌రావు, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, నాయకులు హసనుద్దీన్, వెంకటేశ్వర్లు, సామ్యేల్‌ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు ఈ.వీ.శ్రీనివాస్, మోడెం శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, నాయకులు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, నాయకులు కాయిత రాజ్‌కుమార్, మేకల రాజు, మనోహర్, గడ్డం రమేష్, ఊరగంటి శ్రీను వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
అంతేకాకుండా కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌. విద్యార్ధి, ప్రముఖ కవి పోట్లపల్లి శ్రీనివాస్‌రావు కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి.జితేందర్‌రావు, శనిగారపు రాజమోహన్‌ తదితర కవులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు డాక్టర్‌ వి.విశ్వనాథం, మోత్కూరి మనోహర్‌రావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ తిరువరంగం ప్రభాకర్, జిల్లా కన్వీనర్‌ వల్స పైడి, రహమాన్, బోయినపల్లి పురుషోత్తమరావు, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్‌ కన్వీనర్‌ అస్నాల శ్రీను, కవులు దేవులపల్లి వాణి, దినకర్, అన్వర్‌ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 
 
తెలంగాణలోనే కాళోజీకి గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా కవి కాళోజీ నారాయణరావుకు తగిన గుర్తింపు, గౌరవం లభించిందని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. కాళోజీ జయంతిని హన్మకొండలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ప్రభుత్వం కాళోజీని జయంతిని తెలంగాణ భాషా దినంగా నిర్వహించడంతో పాటు కాళోజీ కేంద్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిమల్ల రవికుమార్, కె.వాసుదేవరెడ్డి, మాడిశెట్టి శివశంకర్, సారంగపాణి, శ్రీకర్, వీఎస్‌ యాకూబ్‌రెడ్డి, కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, బోయినిపల్లి రంజిత్‌కుమార్, వీరగంటి రవీందర్, నల్ల స్వరూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, నాయకులు నలుబోలు సతీష్, చెన్నం మధు. పులి రజనీకాంత్‌ పాల్గొన్నారు. 
 
హెల్త్‌ యూనివర్సిటీలో..
 
ఎంజీఎం : వరంగల్‌ కేఎంసీ ప్రాంగణంలోని ఆరోగ్య నారాయణరావు వర్సిటీలో కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ బి.కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ టి.వెంకటేశ్వర్‌రావులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ అబ్బగాని విద్యాసాగర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సత్యనారాయణ, వైద్యులు ప్రవీణ్, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement