అభివృద్ధికి పెద్దపీట | TRS government overriding the development says Harish Rao | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పెద్దపీట

Published Wed, Nov 23 2016 1:02 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

TRS government overriding the development says Harish Rao

మెదక్ మున్సిపాలిటీ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మెదక్‌పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో చేపట్టనున్న రూ.1.40కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
 
  2వ వార్డు మిలటరీ కాలనీలో రూ. 10 లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో చేపట్టనున్న బూస్టర్ సంప్‌హౌజ్ ప్రహరీ నిర్మాణం, అలాగే పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి చమాన్ చౌరస్తా వరకు రూ.15.43 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు, 11, 12 వార్డుల్లో నర్స్‌ఖేడ్ రోడ్డు నుంచి అంగన్‌వాడి స్కూల్  వరకు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్, 12 వార్డు వెంకట్రావ్‌నగర్ కాలనీలో రూ. 10 లక్షలతో చిల్డ్రన్‌‌స పార్కు ప్రహరీ, 13వ వార్డు ద్వారకా కాలనీలో రూ.55లక్షలతో చేపట్టనున్న చిల్డ్రన్‌‌స పార్కు ప్రహరీ, సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 
 
 ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ రాజమణి, నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కలెక్టర్ భారతిహోళికేరి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి.  వైస్‌చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ ప్రసాదరావు, టీఆర్‌ఎస్ నాయకులు గంగాధర్, పీఆర్‌ఓ జీవన్‌రావు, అరవింద్‌గౌడ్, లింగారెడ్డి, నర్సింలు, సాయిలు, కృష్ణాగౌడ్, రమణ పాల్గొన్నారు. 
 
 రామాయంపేట ( నిజాంపేట) : నిజాంపేటలో మంగళవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజమణి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగ నరేందర్ మంత్రికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.  ముందుగా పెద్దమ్మ ఆలయంలో పూజలుచేశారు.  ఆలయ  పూజారి  రాంమోహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం రూ. 80 లక్షలతో నిర్మించిన సబ్ యార్డును  మంత్రి ప్రారంభించారు. గ్రామ శివారులోని మల్క చెరువు ఫీడర్ ఛానల్ నిర్మాణానికి, గ్రామంలో రూ. 20 లక్షల వ్యవయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి, డిప్యూటీ స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంవద్ద రూ. 20 లక్షల వ్యయంత చేపట్టనున్న కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 
 
 ఇళ్లు కూలిన బాధితులకు  చెక్కుల పంపిణీ 
  నిజాంపేట మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 219 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యారుు. దీంతో ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది. ఈ పరిహారాన్ని చెక్కుల రూపంలో మంత్రి, డిప్యూటీ స్పీకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రామాయంపేట ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి,  మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీల  ఫోరం చైర్మన్లు మానెగల్ల రామకిష్టయ్య, వెంకటస్వామి, టీఆర్‌ఎస్ రామాయంపేట పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, ప్రధాన కార్యదర్శి చంద్రపు కొండల్‌రెడ్డి, నిజాంపేట  సర్పంచ్ తిర్మల్‌గౌడ్, ఇతర సర్పంచ్‌లు పాతూరి ప్రభావతి, భిక్షపతి, సంగుస్వామి, సుంచు పుష్ప, గన్నారం భవాని, నాగరాజు, గ్రామ సహకార సంఘం చైర్మన్ కిష్టారెడ్డి, నస్కల్ సుధాకర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్, ఏఎంసీ డెరైక్టర్ సుభాష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement