ఎన్నికల హామీల అమలులో విఫలం
అర్వపల్లి
ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాల్వాయి రజినీకుమారి విమర్శించారు. ఆదివారం తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రధాన హామీలైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ విద్య, దళితులకు 3ఎకరాల భూమి పంపిణీ, ఇంటికో ఉద్యోగం ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. హరితహారం కార్యక్రమం మంచిదైనా ఎక్కడా ఒక్క మొక్క బతకడం లేదని చెప్పారు. దీని ప్రచారానికి ఖర్చుపెట్టే డబ్బును ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మండల అధ్యక్షుడు దండ వీరారెడ్డి తిరిగి టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి మొరిశెట్టి ఉపేందర్, మీలా కిష్టయ్య, మాజీ ఎంపీపీ మీలా చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు దండ వీరారెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, జె. శోభారాణి, చాడ హతీష్‌రెడ్డి, సీహెచ్. సుధీర్, ఆకారపు రమేష్, జేరిపోతుల యాదగిరి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.