ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నం | TRS trying for votes | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నం

Published Sat, Sep 17 2016 7:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నం - Sakshi

ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నం

నల్లగొండ టూటౌన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.

నల్లగొండ టూటౌన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసి కేసీఆర్‌ గద్దెనెక్కగానే మాటమార్చడం అన్యాయమన్నారు. మజ్లిస్‌ పార్టీ మెప్పు కోసం విమోచన దినోత్సవం జరుపకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, చింతా ముత్యాల్‌రావు, బాకి పాపయ్య, పోతెపాక సాంభయ్య, బండారు ప్రసాద్, బొజ్జ శేఖర్, బొజ్జ నాగరాజు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, కూతురు లక్ష్మారెడ్డి, కూతురు శ్రీనివాస్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement