ఉలవపాడు : జాతీయ రహదారిపై ఉలవపాడు పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కొండపి నుంచి నెల్లూరులోని ఓ మిల్లుకు మినీ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు
-
మినీలారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ ముందు లారీని ఢీకొట్టి ఒకరు
-
బస్సు ఢీకొనడంతో మరొకరు
ఉలవపాడు : జాతీయ రహదారిపై ఉలవపాడు పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కొండపి నుంచి నెల్లూరులోని ఓ మిల్లుకు మినీ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. వేగంగా వెళ్తున్న లారీ రాజుపాళెం సమీపంలోని చాముండేశ్వరీదేవి గుడి వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీలారీ క్యాబిన్‌లో ఉన్న నెల్లూరు జిల్లా జలదంకి మండలం జమ్ములపాళెం గ్రామానికి చెందిన జగ్గం ప్రభాకర్ (40) అక్కడికక్కడే మతి చెందాడు. ఈ ప్రమాదంతో రేషన్ బియ్యం అక్రమ తరలింపు కూడా బయటపడింది. లారీపైన ముగ్గురు కూలీలు కూడా ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
మరో ఘటనలో లారీ క్లీనర్..
చాగల్లు వద్ద రోడ్డు దాటుతున్న లారీక్లీనర్‌ను నెల్లూరు కోమట్ల ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మతి చెందాడు. సూళ్లూరుపేట నుంచి విజయవాడకు లోడుతో వెళ్తున్న లారీని ఆపి డ్రైవర్ పడుకున్నాడు. విజయవాడ బస్టాండ్ సెంటరుకు చెందిన క్లీనర్ కలగాటి అప్పారావు (49) అక్కడ రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని మృతి చెందాడు. రెండు సంఘటనల్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.