ఉన్నతాధికారుల వేధింపులతో అజ్ఞాతంలోకి ..
ఉన్నతాధికారుల వేధింపులతో అజ్ఞాతంలోకి ..
Published Wed, May 17 2017 11:02 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– శ్రీశైలం ఎస్‌టిఓ నాగసవిత
శ్రీశైలం ప్రాజెక్ట్: ఉన్నతాధికారులు వేధిస్తుండడం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు శ్రీశైలం సబ్‌ట్రెజరీ అధికారిణి నాగ విజయ సవిత బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 1వ తేదీన విధులకు హాజరై మధ్యాహ్నం నుంచి అదృశ్యం అయిన ఎస్‌టిఓ సవిత.. బుధవారం సున్నిపెంటలోని పోలీస్ ఔట్ పోస్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్రమ పద్ధతిలో ట్రెజరీ బిల్లులను చెయ్యమని ఉన్నతాధికారులు వేధిస్తున్నారని..వారి మాట వినకపోవడంతో ఎటువంటి సోకాజ్ నోటీసులు జారీ చేయకుండా చార్జ్ మెమోలు ఇచ్చారని ఆమె విలేకరులకు తెలిపారు. మానసికంగా కుంగిపోయిన తాను.. వరంగల్‌లోని తన పినతల్లి వద్దకు వెళ్లాలని చెప్పారు. తనను మానసికంగా వేధిస్తున్న పలువురిపై టుటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
Advertisement
Advertisement