
ఇక్కడ కేసీఆర్‌కూ బుద్ధిచెపుతారు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: నియంతృత్వం, అప్రజాస్వామిక పద్ధతులతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ పతనం తప్పదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే బిహార్‌లో మతతత్వ శక్తులు ఓడిపోయాయన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలనలో, నియంతృత్వంలో మోదీకి, కేసీఆర్‌కు దగ్గరిపోలికలున్నాయన్నారు. అక్కడ మోదీని తిరస్కరించినట్టే ఇక్కడ కేసీఆర్‌కు వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌పార్టీకి మరింత మెజారిటీ పెరుగుతుందన్నారు.