దిగొచ్చిన వెల్లుల్లి ధర
తాడేపల్లిగూడెం : వెల్లుల్లిపాయల ధర భారీగా తగ్గింది. పంట దిగుబడులు పెరగడంతో ధర దిగొచ్చింది. కొంతకాలం క్రితం వరకు కిలో రూ.120 పలికింది. దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌కు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రోజుకు మూడు, నాలుగు లారీల సరుకు వస్తోంది. అయితే కొనే వ్యాపారులు కరువయ్యారు. 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,100 నుంచి 2,150 వరకు ఉంది. గతంలో ఇదే బస్తా రూ.6 వేల వరకు పలకడం గమనార్హం.