విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ తనిఖీలు
62 కేసులు నమోదు
సబ్‌స్టేషన్‌లో మొక్కలు నాటిన అధికారులు
కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం చంపాపేట, రాజేంద్రనగర్ డివిజన్ల విజిలెన్స అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 19 బృందాలు పాల్గొని 62 కేసులు నమోదు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా కందుకూరు సబ్ స్టేషన్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజిలెన్‌స డీఈలు సోమిరెడ్డి, కృష్ణారావు మాట్లాడారు. తమ పరిధిలో 2500 మొక్కలు నాటాలని నిర్ధేశించుకున్నట్లు తెలిపారు.
ఇకపై తప్పనిసరిగా అన్ని జీపీల్లో పంచాయతీ భవనాలు, వీధి దీపాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే సరఫరాను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. పశువుల షెడ్‌లకు పది హెచ్‌పీకి మించకుండా ఉంటే క్యాటగిరి-4 కింద విద్యుత్ బిల్లులు వేస్తామన్నారు. వెరుు్య కోళ్లు పెంపకం ఉన్న షెడ్లకు ఈ విధానం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి, వనస్థలిపురం, చంపాపేట, గగన్‌పహాడ్ ఏడీఈలు హన్మంత్‌రెడ్డి, రాజేందర్, వినోద్‌రెడ్డి, దశరథ, స్థానిక ఏఈ చక్రపాణితో పాటు 27 మంది ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.