విద్యుదాఘాతంతో వాచ్‌మెన్ మృతి | Watchmen killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వాచ్‌మెన్ మృతి

Published Wed, Aug 3 2016 6:12 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Watchmen killed with an electric shock

నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ కరెంటు మోటారు చెడిపోవడంతో మరమ్మతులు చేసే క్రమంలో వాచ్‌మెన్ విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హకీంపేట పారామౌంట్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు రంగారెడ్డి జిల్లా పరిగి మండలం కిష్టాపూర్‌కు చెందిన కె.కిష్టయ్య(40) భార్య నర్సమ్మ, ఇద్దరు కొడుకులు, కూతురుతో కలిసి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.

 

బుధవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్ మోటార్ పాడవడంతో బాగు చేయడానికి యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలింది. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. భర్త మృతితో నర్సమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం చేయాల్సిందిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ కళ్లముందే ఈ ఘటన జరిగిందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడని, అలా కాకుండా తప్పించుకొని పరారయ్యాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement