ధనాగ్రహం
నల్లధనానికి మేం వ్యతిరేకం కాదు
నోట్ల రద్దుపై ముందస్తు ఏర్పాట్లు చేయనందునే ఇబ్బందులు
పాల ప్యాకెట్లకూ పైసా లేక సామాన్యుడు విలవిల
సర్కారు తీరుపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి మండిపాటు
మండుటెండలో చేపట్టిన నిరసన దీక్ష
మద్దతు పలికిన కార్యకర్తలు..ప్రజలు
తిరుపతి మంగళం: నల్లకుబేరుల మాటెలా ఉన్నా నోట్ల రద్దు నిర్ణయం సామాన్య వర్గాలను భూకంపం మాదిరిగా కుదిపేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల ఇబ్బందులపై మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం వరకు కరుణాకరరెడ్డితో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మండుటెండలో కూర్చున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వీరు నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నల్లకుబేరుల భరతం పడతానన్న ప్రధాని మోదీ సామాన్య, మధ్యతరగతి గుండెల్లో గునపాలు దింపారని దుయ్యబట్టారు. నల్లధనాన్ని వెలికితీయాలన్న మోదీ కాంక్ష మంచిదే అరుునప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కూలిపనులు, వ్యాపారాలు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటలసేపు క్యూల్లో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పాల ప్యాకెట్లు కొనుక్కోవాలన్నా డబ్బులు లేవన్నారు. వైద్యం చేరుుంచుకో లేక రోగులు ప్రాణాలు కోల్పోరుున సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. జనం ఇబ్బందులపై ముందుగా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల నల్ల కుబేరులెవరూ ఇబ్బందులు పడడంలేదన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు తమ నల్లధనాన్ని ఎప్పుడో తెల్లధనంగా మార్చేసుకున్నారన్నారని ఆరోపించారు. నిజంగా నల్లధనం వెలికితీయాలనుకుంటే చంద్రబాబు దేశ విదేశాల్లో దాచి ఉంచిన రూ.లక్షల కోట్లు నల్లధనాన్ని వెలికితీయాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. జిల్లాలో సైన్‌స కాంగ్రెస్ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరోపక్క నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్ సిద్ధార్‌థజైన్ ఎక్కడికి వెళ్లారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ చంద్రబాబుకు బినామీలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
కరుణాకరరెడ్డితో పాటు పార్టీనాయకులను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్ద బైఠారుుంచారు. గంట తర్వాత కరుణాకరరెడ్డిని విడుదల చేశారు. సాయంత్రం 4గంటలకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కె.బాబు, రాజేంద్ర, కొమ్ము చెంచయ్యయాదవ్, ముద్రనారాయణ, ఎంవీఎస్.మణి, వెంకటేష్‌రెడ్డి, కట్టా గోపీయాదవ్, పుల్లూరు అమరనాథరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, ఎస్‌కె.ఇమామ్, మబ్బు నాదమునిరెడ్డి, కోటూరు ఆంజనేయులు,అబ్రార్, శివచ్చారి, చెలికం కుసుమ, శ్యామల, గీతాయాదవ్, శాంతారెడ్డి, శారద, సారుుకుమారి, పుణీత, రమాదేవి, దుర్గ పాల్గొన్నారు.