ఇంకా తిప్పలే.. | Problems with the clients wishing to cancel a large banknotes | Sakshi
Sakshi News home page

ఇంకా తిప్పలే..

Published Thu, Nov 17 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

ఇంకా   తిప్పలే..

ఇంకా తిప్పలే..

రాయపర్తి : పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారుు. సోమవారం బ్యాంకులకు సెలవు రావడంతో జిల్లాలోని పలు మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద  ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వారు క్యూలో నిల్చోగా.. తమ వంతు వచ్చే సరికి ఆలస్యం కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

వివిధ ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టినా.. కొద్దిసేపటల్లోనే అవి ఖాళీ అయ్యారుు. దీంతో లైన్‌లో నిల్చున్న వారు ఉస్సూరుమంటూ వెనుతిరిగారు. కాగా, రాయపర్తికి చెందిన పలువురు తమ పిల్లలను పాఠశాలలకు పంపించకుండా ఎస్‌బీహెచ్‌లో లైన్‌లో నిల్చోబెట్టడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement