హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జాదారులు కబ్జా చేశారని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. కబ్జాదారుల వివరాలు దేవాలయాల వద్ద నోటీస్ బోర్డులో ఉంచుతామని తెలిపారు. పోలవరం పనుల నిర్మాణం తీరుపై తమ పార్టీ పూర్తి సంతృప్తితో ఉందన్నారు.
పోలవరంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే పోలవరం పనుల్లో జరగుతున్న జాప్యాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశామని మాణిక్యాలరావు చెప్పారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రగతి వెబ్ సైట్లో ఆలయ సేవలు, ఆస్తులు, ఆభరణాల వివరాలు పొందుపరుస్తామన్నారు.