హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన రోహిత్ వేముల కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు అయ్యేఖర్చును భరించేందుకు కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ ముందుకు వచ్చింది.
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన రోహిత్ వేముల కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు అయ్యేఖర్చును భరించేందుకు కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ ముందుకు వచ్చింది. శనివారం గుంటూరు వచ్చిన కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షుడు తంగేడ్ రోహిత్ తల్లి రాధికకు రూ.10 లక్షల చెక్కును అందించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తాము భరిస్తామంటూ ప్రకటించారు.
ఈ సందర్భంగా తంగేడ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతపరమైన దాడులు పెరిగాయని అన్నారు. ముస్లిం మైనార్టీ, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇలాంటి దాడుల్లో ఇబ్బందులకు గురైన వారిని ఆదుకునేందుకు తాము ముందుంటామని చెప్పారు.