కాకినాడ: ఏపీ ప్రభుత్వం కాపులను బీసీ జాబితాలో చేర్చాలని యోచిస్తే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని, ఐక్య ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జేఎన్‌టీయూ నుంచి కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలోని పగడాలపేట వరకూ పాదయాత్ర నిర్వహించిన ఆయన పగడాలపేటలో మహాత్మ జోతిబా ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకు అన్యాయమే జరుగుతోందన్న కృష్ణయ్య తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు 50 శాతం పైబడి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉన్న ఒక్క రొట్టెనూ అందరూ పంచుకోవాల్సిన పరిస్థితులున్నందున కాపులను బీసీల్లో చేరిస్తే తమకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల్లో అనేక కులాలవారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాల్సిన అసవరం లేదని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేసన శంకరరావు, జిల్లా నాయకులు సంసాన శ్రీనివాసరావు, చొల్లంగి వేణుగోపాల్, తూతిక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
కాపులను బీసీల్లో చేరిస్తే ప్రతిఘటిస్తాం: ఆర్. కృష్ణయ్య
Published Sun, Jan 24 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement