తూప్రాన్‌ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం | We welcome tupran division | Sakshi
Sakshi News home page

తూప్రాన్‌ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం

Published Fri, Sep 9 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

తూప్రాన్‌ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం

తూప్రాన్‌ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి

తూప్రాన్‌:
తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు నర్సాపూర్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్‌ మండలం మనోహరాబాద్‌ శివారులోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును తాను వ్యతిరేకిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భౌగోళికంగా అన్ని విధాలుగా ఆలోచించిన తరువాతే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

కానీ నర్సాపూర్‌కు తాలూకాగా ఓ చరిత్ర కలిగి ఉందన్నారు. అందుకు తాము తూప్రాన్‌తోపాటు నర్సాపూర్‌ను సైతం రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్నే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. కానీ కొందరు సీఎంతో సన్నిహితంగా ఉన్నంఽదును తూప్రాన్‌ను అడ్డుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి. రమణగౌడ్‌, రాజశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement