అడవిలో చుక్క నీరు లేకపోవడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం జనావాసాలు, వ్యవసాయ బావుల వద్దకు వస్తున్నాయి.
కొత్తగూడ(వరంగల్): అడవిలో చుక్క నీరు లేకపోవడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం జనావాసాలు, వ్యవసాయ బావుల వద్దకు వస్తున్నాయి. వరంగల్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో ఒక అడవి దున్న బుధవారం దాహార్తి తీర్చుకునేందుకు వచ్చి ఈశ్వరగూడెం, బత్తులపల్లి గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ బావిలో పడింది.
బావి నుంచి ఎటూ వెళ్లలేక దున్న భీకరంగా అరుస్తుండడంతో అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు జేసీబీతో బావి నుంచి బయటకు దారి చేయడంతో దున్న తిరిగి అడవిలోకి పరుగుతీసింది.