Published
Sat, Oct 8 2016 1:44 AM
| Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
పనిచేయని పోలీసు అధికారులపై వేటు
ఎస్పీ విశాల్ గున్నీ
పొదలకూరు : పని చేయకుండా ప్రజల పట్ల అమర్యాదగా వ్యవహరించే పోలీసు అధికారులపై వేటు తప్పదని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. పొదలకూరు పోలీసుస్టేషన్ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పోలీసు పాలనలో కొంత పట్టు తప్పిందన్నారు. తిరిగి పరిపాలను యాథాతదంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులపై మర్యాదగా వ్యవహరించడం వారి సమస్యను తెలుసుకుని న్యాయం చేయాల్సిందిగా పదేపదే ఆదేశిస్తున్నట్టు తెలిపారు. పనితీరు మార్చుకోని పోలీసు అధికారులపై ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు సేవాదళ్ ద్వారా సేవా కార్యక్రమాలను సైతం చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే తొలిసారిగా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నెల్లూరు రాజరాజేశ్వరీ దేవస్థానంలో పోలీసులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. పొదలకూరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఆక్రమణలు తొలగిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఎస్పీ వెంట ఎస్సై కే.ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.