త్వరలో వివాహం జరగాల్సిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రం గారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ రూరల్: త్వరలో వివాహం జరగాల్సిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రం గారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి చంద్రయ్య కూతురు రాధిక(18) ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉం టోంది. మండలంలోని రాళ్లగూడకు చెందిన సమీప బంధువుతో ఆమెకు ఈ నెల 29న పెళ్లి నిశ్చయమైంది. ఆదివారంరాత్రి రాధిక ఇంట్లో అదే గ్రామానికి చెందిన యువకుడు నరేష్ చొరబడ్డాడు. గమనించిన కుటుంబీకులు అతడిని బంధించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో నరేష్‌ను వదిలిపెట్టారు.
సోమవారం ఆమె కుటుంబీకులు పంచా యితీ పెట్టారు. తన తప్పును ఒప్పుకోవడంతో నరేష్‌ను గ్రామ పెద్దలు మందలించి వదిలేశారు. ఈ ఘటనతో తన పరువు పోయిందని మనోవేదనకు గురైన రాధిక ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.