మహిళ ఆత్మహత్య
Published Sun, Feb 19 2017 11:44 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
గోస్పాడు: మండల పరిధిలోని జూలేపల్లె గ్రామానికి చెందిన ఉమాదేవి(35) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఉమాదేవి పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement