నిమ్మరసమిచ్చి హతమార్చేందుకు యత్నం | women try to kill money lenders in ysr district | Sakshi
Sakshi News home page

నిమ్మరసమిచ్చి హతమార్చేందుకు యత్నం

Published Tue, Jan 12 2016 9:23 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

నిమ్మరసమిచ్చి హతమార్చేందుకు యత్నం - Sakshi

నిమ్మరసమిచ్చి హతమార్చేందుకు యత్నం

చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ముగ్గురు మహిళలకు ఓ మహిళ విషమిచ్చి హతమార్చడానికి యత్నించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతి పరిధిలోని జే. కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హుజ్జమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన పఠాన్ నజీబు దగ్గర కొంత మొత్తం అప్పుగా తీసుకుంది. గత కొన్ని రోజులుగా అడుగుతున్నా తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ రోజు పఠాన్ నజీబు, ఫరీదాబాను, మహెబూబ్‌ జాన్‌తో కలిసి హుజ్జమ్మ ఇంటికి వెళ్లి అప్పు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరింది.

దీంతో హుజ్జమ్మ తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని త్వరలోనే ఇచ్చేస్తానని వారికి నిమ్మకాయ రసం ఇచ్చింది. అది తాగి ఇంటికి వచ్చిన అనంతరం ముగ్గురు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. పఠాన్ నజీబు మృతిచెందింది. మిగతా ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హుజ్జమ్మ ఇచ్చిన నిమ్మరసంలో విషం కలిపడంతోనే ఇలా జరిగిందని స్థానికులు తెలపడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement