రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి అవయవాలను ఆమె తల్లిదండ్రులు మణిపాల్‌లోని ట్రస్టుకు దానం చేశారు.
చనిపోయి.. ‘బతుకు’నిస్తోంది..
Aug 11 2016 11:09 PM | Updated on Aug 1 2018 2:15 PM
ట్రస్టుకు అవయవాలు దానం
ఈపూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి బుధవారం రాత్రి మృతి చెందింది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన సూరే శ్రీనివాసరావు ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లా నందిగామలో ఉంటున్నారు. ఆయన కుమార్తె విష్ణు ప్రియ(22), కుమారుడు వరుణ్ ఈనెల 3వ తేదీన స్వగ్రామంలో శుభకార్యానికి వచ్చి దిచక్రవాహనంపై వెళ్తున్నారు. నర్సరావుపేటలోని శంకరభారతీ హైస్కూల్ వద్ద విష్ణుప్రియ చున్నీ మోటార్ బైక్ వెనుక చక్రానికి చుట్టుకోవడంతో ఆమె బైక్‌పై నుంచి కిందకు పడిపోయింది. చికిత్స కోసం గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయినట్టు చెప్పారు. అనంతరం విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి అవయవాలను ఆమె తల్లిదండ్రులు మణిపాల్‌లోని ట్రస్టుకు దానం చేశారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విష్ణుప్రియకు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 6న ఉద్యోగంలో చేరాల్సి ఉంది.
Advertisement
Advertisement