రౌతులపూడి: ఓ యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కాజులూరు మండలానికి చెందిన అంజిబాబుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.
ఈ దాడిలో అంజిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని తుని ఆస్పత్రికి తరలించారు. ఓ యువతిని ప్రేమించాడనే నెపంతోనే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వివరాలు సేకరిస్తున్నారు.
యువకుడిపై కత్తులతో దాడి
Published Sun, Jun 11 2017 5:06 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement