యువకుడి అనుమానాస్పద మృతి | youngman doughtfull dead | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Published Tue, Aug 2 2016 7:35 PM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

యువకుడి అనుమానాస్పద మృతి - Sakshi

యువకుడి అనుమానాస్పద మృతి

  • భార్య చంపిందంటున్న తల్లిదండ్రులు
  • విచారణ చేపట్టిన పోలీసులు
  • వేములవాడ :  పట్టణంలోని కోరుట్ల బస్టాండు ప్రాంతంలో నివాసముంటున్న పరోళ్ల మురళీకృష్ణ(28) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సిమెంటు గాజులు, సిమెంటు ఇటుకలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మురళీకృష్ణ ఉరఫ్‌ కృష్ణ ఇక్కడే ఓ షెడ్డు వేసుకుని భార్య మౌనికతో ఉంటున్నాడు. మంగళవారం ఇదే షెడ్డులోని ఓ పైపుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా కావలి మండలం కమ్మవారిపాలెం నుంచి రమణయ్య– వెంకటరమణమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం వేములవాడకు వలస వచ్చారు. వీరికి మురళీకృష్ణ, శ్రీకాంత్‌ కుమారులు, కుమార్తె తిరుమల ఉన్నారు. ఇక్కడే సిమెంటు ఇటుకలు, గాజుల పోసుకుంటూ జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పొట్టిపల్లికి చెందిన మౌనికతో మురళీకృష్ణకు వివాహం జరిపించారు. ఆ వెంటనే మరో సిమెంటు తయారీ కేంద్రాన్ని సపరేటుగా పెట్టించారు. రెండేళ్లుగా వీరి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌనిక తాలూకూ బంగారం అంశంలో గొడవలు జరిగేవనీ, ఈక్రమంలోనే మురళీకృష్ణ మరణించాడని చెబుతున్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై సైదారావు, ఏఎస్సై సురేశ్‌ పరిశీలించారు. గదిలోని రక్తపు మరకలు, వేలాడుతున్న తాడు పరిశీలించారు. మృతదేహం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఉండడంతో హతా?.. ఆమ్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే రెండు చేతులకు ఎలా కట్టేసుకుంటాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.  రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  
     
    భార్యే చంపింది... 
    తన కుమారుడిని భార్య మౌనికే చంపేసిందని తల్లిదండ్రులు రమణయ్య, వెంకటరమణమ్మ ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా మౌనిక తన కుమారున్ని ఇబ్బందులు పెడుతోందని, ఇటీవలే బంగారం విషయంలో గొడవ పడిందని చెప్పారు. ఈ గొడవ కారణంగానే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. పుట్టింటింకి వెళుతున్నట్లు చెప్పి భర్తను హత్యచేసి వెళ్లిందని పోలీసులకు వివరించారు.  
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement