ఉల్లాసంగా.. ఉత్సాహంగా
నగరంలో ఉత్సాహంగా
గుంటూరు డివిజన్ యువజనోత్సవం
గుంటూరు వెస్ట్: యువజన సర్వీసులశాఖ స్టెప్ స్వశక్తి ఆధ్వర్యంలో గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గుంటూరు డివిజన్ యువజనోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. వివిధ కళాశాలలకు చెందిన యువతీ యువకులు పాల్గొని తమ ప్రదర్శనలు ఇచ్చి ప్రతిభ చాటుకున్నారు యువజనోత్సవాలకు ముఖ్యఅతిథిగా నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరై మాట్లాడారు. స్టెప్ ఇన్‌చార్జి సీఈవో ఆర్.కృష్ణకపర్ది మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమన్నారు. యువజన సర్వీసుల శాఖ అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి యువజనోత్సవాలను ప్రారంభించారు.
విజేతలు వీరే...
కూచిపూడి నాట్యంలో పి.పవిత్ర మొదటిస్థానంలో నిలవగా ద్వితీయస్థానంలో బి.దుర్గ నిలిచారు. భరతనాట్యంలో మొదటి స్థానంలో జి.సాయిగౌతమి, హిందూస్తాన్ వోకల్ విభాగంలో ఎల్.రాణి వినోవా హెప్సిబీ ప్రథమస్థానంలో నిలిచారు. కర్నాటిక్ వోకల్ విభాగంలో ప్రథమ,ద్వితీయ స్థానాలను రేటూరి గాయత్రీదేవి, పీఎల్ జయతీ పొందారు. వీణ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను గుత్తికొండ లక్ష్మీదుర్గా, కొడాలి వెంకట సాయి మౌనిక, ప్లూట్ విభాగంలో రాచకొండ ఫణితేజ, ఎంఆర్‌వీ పవన్‌కుమార్ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. మృదంగంలో సీహెచ్ ప్రేమ్‌సాయి శ్రీధర్, అన్నవరపు ఘనిలక్ష్మి మొదటి, ద్వితీయ స్థానాలను గెలుచుకున్నారు. హార్మోనియంలో మొదటి బహుమతి ఎ.నీరజ్ గెలుపొందారు. గిటార్‌లో పీఎస్ సందీప్, తేలుకుట్ల అపురూప్ ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఫోక్‌డ్యాన్స్ విభాగంలో ఫిరంగిపురం సెయింట్ గ్జేవియర్ కళాశాలకు చెందిన యువకులు ప్రథమస్థానంలో నిలిచారు. ఫోక్‌సాంగ్ విభాగంలో లవకుమార్ గ్రూపు మొదటిస్థానంలో నిలవగా, జయమ్మ, సుజాత గ్రూపు (అమరావతి) ద్వితీయస్థానంలో నిలిచారు. ఒన్‌యాక్టు ప్లే విభాగంలో ఎ.రుధిర గ్రూపు మొదటిస్థానంలో నిలవగా, వైవీహెచ్ శంకర్ గ్రూపు రెండోస్థానంలో నిలిచింది. ఎలక్యూషన్ విభాగంలో బి.ఉమా మౌనిక, జొనహ్‌వాట్ ప్ర«థమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు.