ఆయన పాలన సువర్ణయుగం
అనంతపురం: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనంతా సువర్ణయుగంలా గడిచిందని పలువురు వక్తలు గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో గడిపారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ పాలన రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, రోగులకు పాలు, ›బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సుభాష్‌రోడ్డులోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
– అనంతపురం నగరంలో అదనపు సమన్వయకర్త నదీంఅహ్మద్ ఆధ్వర్యంలో అమ్మఒడి వృద్ధాశ్రమంలోని వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
– తపోవనం కూడలిలో కనకదుర్గ లారీ అసోసియేషన్ నిర్వాహకులు పుల్లారెడ్డి, పురుషోత్తంరెడ్డి, రామలింగారెడ్డి, కొండారెడ్డి, రామాంజనరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
– కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
– మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి జరుపుకొన్నారు. మడకశిరలో వైఎస్ విగ్రహానికి సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
– కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు.
– హిందూపురం పట్టణంలోని వైఎస్ విగ్రహానికి సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ అకాలమరణంతో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని వాపోయారు.
– ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైఎస్ వర్ధంతి జరుపుకొన్నారు.
– పెనుకొండ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
– పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలంలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
– ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లోని వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ వర్ధంతి జరుపుకొన్నారు.
– తాడిపత్రి పట్టణంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మున్నా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
– రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి జరుపుకొన్నారు. స్థానిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే వీరాపురం గ్రామం దళితవాడలో మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం చేశారు.
– రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి మండలాల్లో పార్టీ శ్రేణులు వైఎస్ వర్ధంతి జరుపుకొన్నారు. ఈసందర్భంగా వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
–వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులు శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశుభ్రం చేసి, మొక్కలు నాటారు. అనంతరం అన్నదానం చేశారు. బిస్కెట్లు పంపిణీ చేశారు.
– గుంతకల్లు పట్టణంలో వైఎస్ విగ్రహానికి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రామలింగప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు.