జోహార్.. వైఎస్సార్
– ఆయన పాలన సువర్ణయుగం
– రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి
– వర్ధంతి సభలో వక్తల పిలుపు
అనంతపురం: అన్ని వర్గాల అభివృద్ధి.. సంక్షేమం రెండుకళ్లుగా పాలన సాగించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని వక్తలు కొనియాడారు. వైఎస్ 8వ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుభాష్‌రోడ్డులోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ‘జోహార్ వైఎస్సార్’, ‘వైఎస్ ఆశయాలు కొనసాగిద్ధాం’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో అత్యంత ప్రజాదరణ కల్గిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఆ సందర్భంగా గుర్తించిన సమస్యలను ముఖ్యమంత్రి కాగానే పరిష్కరించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
ఆయన సేవలు మరువలేరు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలు వైఎస్ సేవలు, ఆయన పాలనను ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. వైఎస్ పాలన సువర్ణయుగం అన్నారు. అన్ని వర్గాలు, అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో గడిపారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత ఒక్క వైఎస్‌కే దక్కిందన్నారు.
జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ తన పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వ్యక్తి వైఎస్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, బీసీ సెల్, సాంస్కృతిక, కిసాన్ సెల్, ఎస్సీ సెల్, ట్రేడ్ యూనియన్, విద్యార్థి, మహిళా విభాగాల జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, రిలాక్స్ నాగరాజు, మిద్దె భాస్కర్‌రెడ్డి, పెన్నోబులేసు, ఆదినారాయణరెడ్డి, బండి పరుశురాం, బోయ సుశీలమ్మ, నాయకులు అనంత చంద్రారెడ్డి, మీసాల రంగన్న, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, పాలె జయరాంనాయక్, యూపీ నాగిరెడ్డి, మారుతీనాయుడు, గోపాల్‌మోహన్, కసనూరు శ్రీనివాసులు, కార్పొరేటర్ జానకి, మహిళా విభాగం శ్రీదేవి, కృష్ణవేణి, దేవి, కొండమ్మ, ఉషా పాల్గొన్నారు.