పోలవరం నిర్వాసితులు అండగా ఉంటాం | ysrcp agency visit | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసితులు అండగా ఉంటాం

Published Sat, Sep 17 2016 10:36 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

పోలవరం నిర్వాసితులు అండగా ఉంటాం - Sakshi

పోలవరం నిర్వాసితులు అండగా ఉంటాం

  • వారికి అండగా వైఎస్సార్‌ సీపీ పోరాడుతుంది
  • ఎమ్మెల్సీ బోస్, జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
  •  
    కూనవరం: 
    పోలవరం నిర్వాసితులు నీటి దాతలని వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్‌ సీపీ æ పోరాడుతుందని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్ర బోస్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. మండలంలోని నర్సింగపేట, పెద నర్సింగపేట, కూళపాడు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీవర్షానికి సర్వం తుడిచి పెట్టుకుపోయి ఇసుక మేటలు వేసిన పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌(బాబు)తో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. 300పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, చేలల్లో ఇసుక మేటలు వేసిందని వారు తెలిపారు. పంటనష్టం సర్వేకి వచ్చిన రెవెన్యూ అధికారులు పోలవరం పరిహారం తీసుకున్న భూములకు నష్టపరిహారం రాదని సర్వేకూడా చేయమని చెప్పారని రైతు కొర్సా రవికుమార్‌ తెలిపారు.  బోస్, కన్నబాబు మాట్లాడుతూ ఐటీడీఏ సప్లాన్‌ నిధుల నుంచి తక్షణమే ఇసుక మేటలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. పంటనష్టం క్రింద ఎకరానికి రూ.2 లక్షలు అందజేయాలని కోరారు. అనంతరం కాచవరంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏచట్ట ప్రకారం పట్టిసీమ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు  పరిహారం ఇచ్చారో అదే చట్టం ప్రకారం పోలవరం ముంపు బాధితులకు కూడా  నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు పాతబస్టాండ్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల కన్వీనర్‌ ఆలూరి కోటయ్య, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి కొవ్వూరి శివయాదవ్, వైస్‌ ఎంపీపీ గుజ్జాబాబు, జిల్లానాయకులు పూసం ప్రసాద్, భరతమూర్తి, కొమ్మాని మోహన్‌రావు, పాపారావు, ఎంపీటీసీలు కరక లక్ష్మి, సరియం మహాలక్ష్మి, సర్పంచ్‌ కారం పార్వతి, సాయిబాబు, సీతారామారావు, ఎస్కే కిస్మత్, కొండల రావు, దివాకర్, సాయిల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    వీఆర్‌పురం మండలంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి
    వీఆర్‌పురం: వీఆర్‌పురం మండలంలో హెల్త్‌ ఎమర్జెన్సీని వెంటనే ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి నలుగురు మృతి చెందడంతో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీసి తన తరఫున మృతుల కుటుంబాలను పరామర్శించాల్సిందిగా సూచించడంతో శనివారం కన్నబాబు, బోస్, ఎమ్మెల్యే రాజేశ్వరి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ వారిని  పరామర్శించారు.  లక్ష్మీనగరంలో ఈ వ్యాధితో మృతి చెందిన సరియం బాబూరావు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. బాబూరావు తండ్రి బొజ్జి, తమ్ముడు ముత్తయ్యలు కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అన్నవరం గ్రామంలో ఈ వ్యాధితో మృతి చెందిన  పూసం మంగవేణి , బురకా ఎర్రయ్య, గొడ్ల కన్నయ్య కుటుంబ సభ్యులను కూడా వారు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఈ మరణాలకు ప్రభుత్వం  నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడి నెల పైగా కావస్తున్నా ఇప్పటి వరకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.   గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించమని అడిగితే ముఖ్యమంత్రి పేరు చెప్పి తప్పిచుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల  ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం  ప్రకటించాలని కోరారు. తమ పార్టీ తరఫున కూడా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement